18-03-2025 12:00:00 AM
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో అలరించిన హీరో ప్రదీప్ మాచిరాజు తన రెండో చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో వస్తున్నాడు. ఈ యూనిక్ లవ్‌అండ్‌ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు దర్శక ద్వయం డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహించారు. మాంక్స్‌అండ్‌మంకీస్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది.
వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్‌గౌడ్, ఝాన్సీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అయితే, తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. వేసవి కానుకగా ఏప్రిల్ 11న సినిమా థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ చిత్రానికి డీవోపీ: ఎంఎన్ బాలరెడ్డి; సంగీతం: రధన్; సాహిత్యం: చంద్రబోస్, రాకేందు మౌళి, శ్రీధర్ ఆవునూరి; కథరి సందీప్ బొల్లా; స్క్రీన్‌ప్లే నితిన్, భరత్.