calender_icon.png 28 February, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోగిపేటకు వన్నెతెచ్చిన గిరి ప్రదర్శన

28-02-2025 12:26:06 AM

ఆందోల్ ఫిబ్రవరి 27 : జోడు లింగాల జోగినాథ్ ఆలయం గిరి ప్రదర్శనను భక్తులు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. గురువారం నాడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జోగినాధుడి గిరి ప్రదర్శనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జోగిపేట నామకరణానికి మూలాధారమైన జోగినాథ  ఆలయంలో  భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హిందువుల ఆరాధ్యదయమైన గోమాతకు పూజలు నిర్వహించి గిరి ప్రదర్శన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు, రాజకీయ పక్షాల నాయకులు, కార్యకర్తలు, యువజన సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.