జనరల్ సెక్రటరీగా ప్రేమ్ విజయం
హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా గిరి శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు. శనివారం సెక్ర టేరియట్‌లో ఎన్నికలు నిర్వహించారు. ఆదివారం ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.
సంఘం వైఎస్ ప్రెసిడెంట్ (జనరల్)గా నవీన్‌కుమార్, మరో వైఎస్ ప్రెసిడెంట్ (ఉమెన్) లావణ్య లత విజయం సాధించారు. జనరల్ సెక్రటరీగా ప్రేమ్, అడిషన్ సెక్రటరీగా భూక్యా రాము, పబ్లిసిటీ జాయింట్ సెక్రటరీగా రాజేశ్వర్ ఎన్నికయ్యా రు.
కల్చరల్ జాయింట్ సెక్రటరీగా యామిని కనకతార, స్పోర్ట్స్ విభాగం జాయింట్ సెక్రటరీగా వంశీధర్‌రెడ్డి విజ యం సాధించారు. మహిళా విభాగం జాయింట్ సెక్రటరీగా నీరజాక్షి, ఆర్గనైజేష న్ విభాగం నుంచి కే శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందినట్టు ప్రకటించారు.