calender_icon.png 20 April, 2025 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘గిరి’ ఉత్పత్రులు ప్రారంభం

18-04-2025 12:00:00 AM

విద్యార్థులకు స్వచ్ఛమైన చిరుధాన్యాలు

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): గిరిజన సంక్షేమ కార్యదర్శి ఏ శరత్ విప్లవాత్మక ఆలోచనతో అటవీ కొండల నుంచి సేకరించిన స్వచ్ఛమైన గిరిజన తేనెతో తయారు చేసిన అధిక నాణ్యత గల మిల్లెట్ ఆధారిత చిక్కీలు, కుకీలను తయారు చేసే న్యూగిరి ఉత్పత్తులను గురువారం ప్రారంభించారు. డీఎస్‌స్ భవన్‌లో న్యూ గిరి ఉత్పత్తిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుకులాలు, పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చిరుధాన్యాల్లో అధిక నాణ్యత ఉండేందుకు గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల ఆధ్వర్యంలో సేకరించిన స్వచ్ఛమైన తేనెను ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. దీని ద్వారా గిరిజనులకు ఉపాధి లభించడంతోపాటు విద్యార్థుల ఆరోగ్యానికి దోహదం చేయవచ్చాన్నారు.

ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, టీజీజీసీసీ చైర్మన్ కోట్నాక్ తిరుపతి పూర్తి మద్దతు తెలిపారని చెప్పారు. ఇంటెన్సివ్ పరిశోధన, విస్తృతమైన ఉత్పత్తి పరిజ్ఞానంతో, న్యూట్రిహబ్ ఐసీఏఆర్ ఐఐఎంఆర్ సీఈవో, డైరెక్టర్ డాక్టర్ బి. దయాకర్‌రావు, మిల్లెట్ న్యూట్రి చిక్కీ, హనీ మిల్లెట్ కుకీలతో ఉత్తమ, అత్యంత స్వచ్ఛమైన ఉత్పత్తులను రూపొందించారు.