* ఆలయ చరిత్రలోతొలిసారి మహత్తర ఘట్టం
యాదాద్రి భువనగిరి (నల్లగొండ), డిసెంబర్ 11 (విజయక్రాంతి): ప్రముఖ పుణ్య క్షేత్రమైన యాదాద్రిలో అయ్యప్పమాలధారులు బుధవారం సామూహిక గిరి ప్రదక్షిణ చేశారు. ఆలయ చరిత్రలో తొలిసారి అయ్యప్పమాలధారులకు ఆలయ బోర్డు గిరి ప్రదక్షిణకు అవకాశం కల్పించింది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి దాదాపు 10 వేల మందికిపైగా మాలధారులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం వారు లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కూడా మాలధారులతో కలిసి గిరి ప్రదక్షిణ చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.