చార్మినార్, అక్టోబర్ 29: నెహ్రూ జూపార్కులో నిత్యం సందర్శకులను అలరించే మగ జిరాఫీ సునామీ బసంత్ అనారోగ్య సమస్యలతో సోమవారం రాత్రి మృతిచెందింది. ఈ జిరాఫీ వయస్సు 20 ఏళ్లు. 2004లో న్యూఢిల్లీలోని నేషనల్ జువలాజికల్ పార్కులో బసంత్ జన్మించింది. జంతు మార్పిడిలో భాగంగా 2009లో హైదరాబాద్లోని నెహ్రూ జూపార్కుకు తరలించారు. జూ సిబ్బంది, అధికారులు.. బసంత్ మృతిపట్ల 2 నిమిషాలు మౌనం పాటించారు.