20-02-2025 01:10:01 AM
దుబాయ్: టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. బ్యాటింగ్ విభాగంలో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజంను వెనక్కి నెట్టిన గిల్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థా నాన్ని ఆక్రమించాడు. ఇటీవలే స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఒక సెం చరీ సహా రెండు అర్ధసెంచరీలతో దుమ్మురేపిన గిల్ 796 పాయింట్లతో అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు.
వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్ నంబర్‌వన్ ర్యాంకు అందుకోవడం ఇది రెండోసారి. గతంలో 2023 వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా గిల్ అప్పుడు కూడా బాబర్‌ను వెనక్కి నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (773 పాయింట్లు) రెండోస్థానానికి పడిపోగా.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (761 పాయింట్లు), విరాట్ కోహ్లీ (727) మూడు, ఆరు స్థానాల్లో నిలిచారు.
ఇంగ్లండ్‌తో సిరీస్‌లో విశేషంగా రాణించిన శ్రేయస్ అయ్యర్ కూడా ఒక స్థానం ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక స్థానం ఎగబాకి నాలుగో స్థానంలో నిలవగా.. హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ (624 పాయింట్లు) పదో స్థానం నిలబెట్టుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో భారత్ నుంచి రవీంద్ర జడేజా మినహా మరెవరికి చోటు దక్కలేదు