calender_icon.png 6 March, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద ఇంటి ఆడబిడ్డకు పుస్తె మట్టెల బహుకరణ

02-03-2025 06:35:12 PM

కొల్చారం (విజయక్రాంతి): పేదింటి ఆడ బిడ్డల పెళ్లిళ్లకు తన వంతు సహకారం చేస్తున్న మనసున్న మారాజు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘువీరా రెడ్డి అని భాజపా మెదక్ జిల్లా కొల్చారం మండల శాఖ అధ్యక్షుడు పంతులు హరీష్ పేర్కొన్నారు. ఆదివారం నాడు కొల్చారం మండల పరిధిలోని సీతారాం తండా గ్రామంలో సరితా బాయ్ రవికుమార్ లకుమార్తె లావణ్య వివాహానికి తనవంతుగా పుస్తెమెట్టలను బహుకరించారు. అలాగే చిన్న ఘనపూర్ గ్రామంలోని ఎరుకల మరియమ్మ రత్నయ్యల కూతురు వివాహానికి పుస్తె మట్టలను బహుకరించారు.

ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ... గొప్ప మనసున్న వ్యక్తి రామ్ రెడ్డి రఘువీరారెడ్డి అని నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎందరో పేదింటి ఆడబిడ్డల వివాహానికి పుస్తె మట్టెలు బహుకరిస్తున్న మహా నాయకుడు రఘువీరారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు పల్లె రవికాంత్, బాబా గౌడ్, పులబోయిన పెంటయ్య, మల్లేష్ యాదవ్, బిజెపి మండల గిరిజన మోర్చా అధ్యక్షుడు కేతావత్ ఫుల్ సింగ్, సీనియర్ నాయకులు సంతోష్, లాలా సింగ్, రమేష్ బంధుమిత్రులు పాల్గొన్నారు.