భీమదేవరపల్లి, డిసెంబరు 11: ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వీరభద్రుడి కోవెలకు ఆలయ మాజీ చైర్మన్ పింగిళి జైపాల్‌రెడ్డి దంపతులు పల్లకీని బహూకరించారు. బుధవారం దేవాలయానికి స్వయంగా వెళ్లి పల్లకీని అప్పగించారు. ఆలయ అర్చకులు పల్లకీతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కిషన్‌రావు, అర్చకులు మొగిలిపాలెం రాంబాబు, తాటికొండ వీరభద్రయ్య పాల్గొన్నారు.