calender_icon.png 10 March, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని మండలంలో పెద్దపులి సంచారం

09-03-2025 09:06:22 PM

ఆందోళనలో గ్రామస్తులు..

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ఎగ్లాస్ పూర్, శాస్త్రులపల్లి, అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నది. ఈ విషయం తెలిసిన స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపులిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. శాస్త్రులపల్లి గ్రామ శివారులోని పొలాల దారి నుండి అడవిలోకి పులి వెళ్లినట్లు పులి అడుగులను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఉదయం పూట పశువుల కాపరులు రైతులు పొలాల వైపు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. అధికారులు పెద్దపులిని పట్టుకొని బంధించాలని ఆయా గ్రామాల ప్రజలు అటవీ శాఖ అధికారులను వేడుకుంటున్నారు.