భీంపూర్ మండలం గొల్లఘట్ తాంసి శివారులో చూసిన లారీ డ్రైవర్లు
ఆదిలాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో తరచూ పెద్దపులులు, చిరుతపులుల సంచారం కలకలం రేపుతున్నాయి. పులుల సంచారంతో అటవీ ప్రాంతాల సమీప గ్రామాలు ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పులి సంచరించిన ఆనవాళ్లను గుర్తించిన అటవీ అధికారులకు తాజా బీంపూర్ మండలంలో పులి సంచరించడంతో కంటిమీద కునుకు లేకుండా పోతు తాంసి సెక్షన్ పరిధిలోని భీంపూర్ మండలం గొల్లఘట్ తాంసి (కె) శివారులో పిప్పల్ కోటి రిజరాయర్ పని ప్రదేశంలో సోమవారం రాత్రి లారీ డ్రైవర్లకు పులి కనిపించింది.
మహారాష్ర్ట తిప్పేశర్ నుంచి వస్తున్న పులులు కొన్ని రోజులుగా గొల్లఘట్, తాంసి (కె) ప్రాంతాల్లో తిరు తాజాగా తాంసి (కె) గ్రామ సమీపంలో కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఆర్లి (టీ) సెక్షన్ అధికారి మోపత్ రావ్, బీట్ ఆఫీసర్లు సాయి, శ్రీనివాస్, రామేశర్ పులి సంచరించిన ప్రాంతంలో పాదముద్రాలను సేకరిస్తున్నారు.