calender_icon.png 17 October, 2024 | 6:45 PM

ఘుమఘుమలాడే షాహీ ఆలూ

17-10-2024 12:00:00 AM

భారతదేశం మసాలాలకు పెట్టింది పేరు. మసాలాలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మసాలాలతో అద్భుతమైన వంటలు తయారు చేసుకోవచ్చు. కేవలం నాన్ వెజ్ వంటకాలే కాకుండా.. వెజిటేరియన్ ఫుడ్స్‌కి కూడా నాన్ వెజ్ టచ్ ఇవ్వొచ్చు. ఇలా నాన్ వెజ్‌కి ఏమాత్రం తగ్గని రెసిపీల్లో షాహీ బేబీ పొటాటో ఒకటి. ఒక్కసారి తిన్నారంటే.. మళ్లీ తినాలి అనిపించే ఫుడ్ ఐటమ్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. 

కావాల్సిన పదార్థాలు: చిన్న సైజు ఆలుగడ్డలు, నూనె, కారం, ఉప్పు, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు. 

తయారీ విధానం: ముందుగా ఆలుగడ్డలను శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని నూనెలో డీప్ ప్రై చేసుకోవాలి. అన్ని వైపులా చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి కొత్తిమీర, కొద్దిగా పెరుగు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి మిక్సీ పట్టాలి.

ఆ తర్వాత మరో పాన్ తీసుకొని కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు, క్యాప్సికమ్, కరివేపాకు వేసి పెద్ద మంట మీద ఓ ఐదు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత ఇందులో వేయించిన ఆలుగడ్డలు వేసి మరో ఐదు నిమిషాలు పెద్ద మంట మీద మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించాలి.

ఇందులోనే కొత్తిమీర పేస్ట్, చాట్ మసాలా, గరం మసాలా, నిమ్మరసం పిండి.. చిన్న మంట మీద ఓ పది నిమిషాలు బాగా వేయించి.. సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది. వీటిని గ్రీన్ చట్నీ లేదా టమాటో సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.