calender_icon.png 22 February, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘోష్ కమిషన్ గడువు 2 నెలలు పొడిగింపు

21-02-2025 01:21:53 AM

*ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 

హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాం తి): మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తు న్న జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ గడవును మరో 2 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

గతేడాది మార్చిలో ప్రభుత్వం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేయగా, ఏప్రిల్ నుంచి విచారణ ప్రారంభించింది. ఇప్పటికే నీటిపారుదల శాఖ ఈఎన్‌సీలు, మాజీ ఈఎన్‌సీలతో పాటు చీఫ్ ఇంజినీర్లు, ఎస్‌ఈలను కమిషన్ విచారించింది. ఇక నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఇతర హోదా ల్లో పనిచేసిన ప్రస్తుత, మాజీ ఐఏఎస్‌లను విచారించి బరాజ్‌ల నిర్మాణంలో కీలక నిర్ణయాలు ఎవరు తీసుకున్నారన్న అంశంపై సాక్ష్యాలు సేకరించేందుకు సన్నద్ధమైంది.