calender_icon.png 23 February, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మరోసారి ఏకగ్రీవం

21-02-2025 03:53:51 PM

హైదరాబాద్: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ(GHMC Standing Committee)మరోసారి ఏకగ్రీవమైంది. ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ ఉపసంహరించు కున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఉపసంహరణతో స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవమైంది. సంఖ్యాబలం లేకపోవడంతో బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. జీహెచ్ఎంసీ(Greater Hyderabad Muncipal Corporation ) స్టాండింగ్ కమిటీకి మొత్తం 17 నామినేషన్లు దాఖాలయ్యాయి. ఎంఐఎం-8, కాంగ్రెస్-7, బీఆర్ఎస్-2 నామినేషన్లు దాఖలు చేశాయి. బీఆర్ఎస్ పార్టీ ఉపసంహరణతో 15 మంది సభ్యుల స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం అయింది. పదేళ్లలో తొలిసారి స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉండనున్నారు.