21-02-2025 10:03:18 AM
హైదరాబాద్: ఆస్తి పన్ను వసూళ్లపై జీహెచ్ఎంసీ(Greater Hyderabad Municipal Corporation) కఠినంగా వ్యవహారిస్తోంది. మొండి బకాయిలు చెల్లించని ఆస్తులను బల్దియా అధికారులు సీజ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీకి రూ. 9,800 కోట్ల మొండి బకాయిలు రావాల్సిఉంది. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్ లోని రోడ్ నంబర్ 30లో ఉన్న తాజ్ బంజారా హోటల్(Taj Banjara Hotel seized) ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. జీహెచ్ఎంసీ పన్ను(GHMC Property Tax) చెల్లించకపోవడంతో సీజ్ చేసినట్లు అధికారులు తెలపారు. రూ. కోటి 43 లక్షల ఆస్తిపన్ను చెల్లించాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. పన్ను చెల్లించాలని అనేకసార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని జీహెచ్ఎంసీ ఆరోపించింది. రెడ్ నోటీస్ ఇచ్చినా స్పందించకపోవడంతో సీజ్ చేశామని అధికారులు వెల్లడించారు. ఆస్తిపన్ను చెల్లింపులో ఐదు లక్షల నిర్మాణాలు అలసత్యం వహిస్తున్నాయి.
ఈ ఆర్థిక ఏడాది ముగిసేలోగా పన్ను వసూలును జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి 29 వరకు రూ. 2,200 కోట్ల పన్ను వసూలే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ముందుకు పోతుంది. గ్రేటర్ లో 23లక్షల నిర్మాణాల్లో 12 లక్షల మంది పన్ను చెల్లిస్తున్నారు. గత ఆర్థిక ఏడాదిలో లక్షా 8 వేల ఆస్తులకు సంబంధించి రూ, 320 కోట్లు వసూలు అయ్యాయి. ఆస్తి పన్ను వసూలుపై అధికారులకు బల్దియా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మార్చి 29లోగా మొండి బకాయిలు వసూళ్లు చేయాల్సిందేనని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి(GHMC Commissioner Ilambarithi) కీలక ఆదేశాలిచ్చారు. ఆస్తి పన్ను చెల్లింపు కోసం మరోసారి ఓటీఎస్ అమలుకు జీహెచ్ఎంసీ యోచిస్తోంది. అటు పేరుకుపోతున్న పన్నుల బకాయిల కోసం జీహెచ్‌ఎంసీ పలుమార్లు నోటీసులు(GHMC Notices) జారీ చేసినట్లు సమాచారం. పన్నులు కట్టడంలో హోటల్ యాజమాన్యం విఫలమవడంతో హోటల్‌ను సీజ్ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.