calender_icon.png 4 February, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మిఆకస్మిక పర్యటన

04-02-2025 12:20:26 AM

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని  పలు ప్రాంతాల్లో జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి సోమవారం పర్యటించారు.

గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్ల చెరువు,కొండపూర్ డివిజన్ లోని హఫీజ్ పేట్ రోడ్డులోని సమస్యలను పరిశీలించారు. అలాగే ఆయా కాలనీలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.జీహెచ్‌ఎంసీ ఖాళీ  స్థలాలను ఆక్రమణలకు గురి కాకుండా  చూడాలని అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే పెండింగ్ లో ఉన్న అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చందానగర్ డీసీ మోహన్ రెడ్డి, సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.