calender_icon.png 27 September, 2024 | 6:54 PM

మూసీనది ప్రక్షాళనలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం

27-09-2024 04:50:53 PM

హైదరాబాద్: మూసీ నది ప్రక్షాళనలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్వాహితులకు అండగా ఉండేందుకు సిబ్బందిని నియామకం చేసింది. 14 మంది హౌసింగ్ సిబ్బందిని నియమిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ సిబ్బంది నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లకు తరలిస్తున్నారు. పిల్లిగుడిసెలు, జంగమ్మెట్, ప్రతాపసింగారం, సాయిచరణ్ కాలనీ, కమాలనగర్, కొల్లూరు-1, గాంధీనగర్, జైభవానీనగర్, తిమ్మాయిగూడ, నార్సింగి, బండ్లగూడ, డి.పోచంపల్లి-2, బాచుపల్లి 2 పడకల ఇళ్లు కేటాయించారు. 

అటు గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో పోస్టర్లు బ్యాన్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వాల్ పోస్టర్లు, వాల్ పెయింటింగ్స్ పై సీరియస్‌గా వ్యవహరించాలని సర్క్యులర్ జారీ చేశారు. సినిమా థియేటర్ వాళ్ళు కూడ ఎక్కడా పోస్టర్లు అతికించకుండ చూడాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశించారు. ఒకవేళ పోస్టర్లు వేస్తే జరిమానా విధించాలని కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు.