ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన స్టాండింగ్ కమిటీ
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (విజయక్రాంతి): 2025--26 ఆర్థిక సంవత్సరానికి రూ. 8,440 కోట్లతో ప్రవేశపెట్టిన జీహెఎంసీ బడ్జెట్ అంచనా ప్రతిపాదనలను సోమవారం జరిగిన ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో స్టాండింగ్ కమిటీ ఆమోదించింది.
నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక బడ్జెట్ సమావేశానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, స్టాండింగ్ కమిటీ సభ్యులు బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, మహమ్మద్ ముజఫర్ హుస్సేన్, మహమ్మద్ ఖదీర్, మన్నె కవితారెడ్డి, మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, ఉప్పలపాటి శ్రీకాంత్, సబిహ బేగం, చింతల విజయశాంతి, కంది శైలజ, అడిషనల్ తదితరులు హాజరయ్యారు.
బడ్జెట్‌పై స్టాండింగ్ కమిటీ సమావేశంలో విస్తృతంగా చర్చించి ఆమోదించారు. పలు విభాగాలకు సంబంధించి అడిగిన సభ్యుల సందేహాలను ఆయా అధికారులు నివృత్తి చేశారు. కమిషనర్లు శివ కుమార్, గీతా రాధిక పాల్గొన్నారు.