calender_icon.png 16 March, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గజెల్లి మోహన్‌కు జాతీయ ఉగాది పురస్కారం, సేవారత్న అవార్డు ప్రధానం

15-03-2025 11:38:51 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): తార ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్, తెలంగాణ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో భారతీయ సాంప్రదాయ సాంస్కృతిక కలొస్తవంలో భాగంగా జాతీయ ఉగాది పురస్కారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటులు సుమన్ , మధ్యప్రదేశ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికి పండ్ల నరహరి, ప్రముఖ రచయిత నందిని సిద్ధారెడ్డి, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, పలువురు రచయితలు పాల్గొన్నారు.  ఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణ ఇతర రాష్ట్రాల నుండి సాంప్రదాయ నృత్యాల ప్రదర్శన జరిగినది.

సందర్భంగా వివిధ రంగాలలో సేవలందిస్తున్న వారికి జాతీయ ఉగాది పురస్కారం కింద అవార్డులను అందించడం జరిగింది. ఇందులో భాగంగా గత 30  సంవత్సరాలుగా సామాజిక సేవలో, సంఘమిత్ర, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల ద్వారా అనేక సంఘ సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో భాగస్వాములవుతూ గతంలో జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం చేత ప్రభుత్వ ఇతర సంస్థల నుండి బెల్లంపల్లికి చెందిన గజెల్లి మోహన్ బహుమతులు, అవార్డులు దక్కించుకున్నారు.  గతంలో చేసిన సేవలను ఆధారంగా చేసుకుని గజెల్లి మోహన్ కు జాతీయ ఉగాది పురస్కారం కింద  సేవా రత్న అవార్డును ముఖ్య అతిథులుగా హాజరైన సినీ నటులు సుమన్ చేతుల మీదుగా అందజేశారు. తనకు అవార్డులు అందజేసిన తార ఆర్ట్స్ అకాడమీ కి గజల్ మోహన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.