calender_icon.png 1 November, 2024 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్మరాజుపై వెబ్ సిరీస్ రావాలి

12-05-2024 01:00:26 AM

ప్రముఖ సాహితీవేత్త గజల్ శ్రీనివాస్

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 11 (విజయక్రాంతి) : ధర్మాత్ముడైన చక్రవర్తి ధర్మ రాజు వ్యక్తత్వంపై, ఆయనలోని ఉత్తమమైన రాజనీతి, పరిపాలన సంస్కరణలు, దక్షత వంటి అనేక అంశాలపై లోతుగా విశ్లేషణ చేస్తూ సమగ్రమైన వెబ్ సిరీస్ రావాల్సిన అవసరముందని ప్రముఖ సాహితీవేత్త డా. గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు తన అవతార కారణమైన ధర్మసంస్థాపన లక్ష్యాన్ని నెరవేర్చడానికి ధర్మరాజును భారతావనికి మహా చక్రవర్తిని చేశాడన్నారు. బరంపురంకు చెందిన డా.కొల్లూరి నారాయణరావు రాసిన సిద్ధాంత గ్రంధం శ్రీ మదాం ధ్ర మహాభారతం, ధర్మరాజు పాత్ర గ్రంథ ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని గ్రంథ ఆవిష్కరణ చేశారు. అనంతరం రచయితను అభినందించారు. కార్యక్ర మంలో ప్రముఖ గాయని ద్విభాష్యం కళ్యా ణి, సాధనాల స్వామి నాయుడు, హరిశంకర్‌శర్మ, బుద్ధరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు.