03-04-2025 12:00:00 AM
ముషీరాబాద్, ఏప్రిల్ 2: (విజయక్రాంతి): ఈనెల 5న హైదరాబాద్ చారిత్రా త్మక చౌమహల్లా ప్యాలెస్ లో జంట నగరాల కళా ప్రియుల కోసం గజల్, నృత్య, సంగీత ఉత్సవాలు చౌమహల్లా ప్యాలెస్ సౌజన్యంతో పరిచాయ్ ఆరట్స్ ఫౌండేషన్ నిర్వహిస్తుందని ఫౌండర్ ట్రస్టీ జైవంత్ నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
భారతీయ శాస్త్రీయ సంగీతం, గజల్, నృత్యం ద్వారా సాంప్రదాయాన్ని కాపాడటం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రచారం చేయడం లక్ష్యంగా ఈ ఒక రోజు ఉత్సవాలు భారతదేశంలోని ప్రఖ్యాత కళాకారులచే నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈనెల 5 న సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమౌతాయని, భారతదేశ ప్రముఖ కళాకారులూ న్యూఢిల్లీ నుండి పండిట్ రాజేంద్ర గంగాని (కథక్), భోపాల్ నుండి పండిట్ ఉమాకాంత్, అనంత్ గుండెచా (ధ్రుపద్), హైదరాబాద్ నుండి యువ సంచలనం జ్యోతి శర్మ (గజల్) ఈ ఉత్సవంలో ప్రదర్శనలు ఇస్తున్నారని వెల్లడించారు.
సంగీతం, నృత్యం భారతీయ సంస్కృతిలో అంతర్భాగం గుర్తించి చౌమహల్లా ప్యాలెస్ యాజమాన్యం హైదరాబాద్ కళ ప్రియుల కోసం ఇకపై తరచుగా దాని ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణహించిందని, అందులో భాగమే ఈ గజల్, నృత్య, సంగీత ఉత్సవాలు అని పేర్కొన్నారు.
ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 3, 4 తేదీలలో ప్యాలెస్ ప్రవేశ ద్వారం రిసెప్షన్ కౌంటర్ వద్ద ఉచిత ఆహ్వాన కార్డులను తీసుకొని రావాలని జైవంత్ నాయుడు కోరారు.