calender_icon.png 25 December, 2024 | 12:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఘాటి’ అప్‌డేట్ వచ్చేసింది..

06-11-2024 12:00:00 AM

అనుష్క శెట్టి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత ఏం సినిమాలు చేస్తున్నారనే విషయంలో ఇప్పటి వరకూ ఏమాత్రం క్లారిటీ లేదు. తాజాగా ఆమె గురించి ఆసక్తికర అప్‌డేట్స్ వెలుగు చూస్తున్నాయి. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఆమె సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఘాటి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. గతంలోనూ క్రిష్ దర్శకత్వంలో ‘వేదం’ అనే చిత్రంలో అనుష్క నటించారు.

ఘాటి చిత్రం వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న రెండవ ప్రాజెక్ట్ కావడం గమనార్హం. ఈ సినిమా షూటింగ్ కేవలం మూడు రోజుల్లో అనుకోకుండా అనుష్క పుట్టినరోజుతో పూర్తవుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, మేకర్స్ రెండు ముఖ్యమైన అప్‌డేట్‌లను అందిస్తున్నారు-. మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు ఎ స్పెషల్ గ్లింప్స్ ఇన్‌టు ది వరల్డ్ ని రిలీజ్ చేస్తున్నారు.

ఘాటి సినిమాతో పాటుగా అనుష్క ‘కథనార్’ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కూడా తుది దశకు చేరుకుందనే వార్తలు వినవస్తున్నాయి. రెండు సినిమా విడుదల తేదీపై త్వరలోనే ప్రకటన రానుంది. దీంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.