ఒకరికి తెలియకుండా ఒకరికి ప్లాట్ల విక్రయం
నిందితుడిని అదుపులోకి తీసుకున్న నాగోల్ పోలీసులు
ఎల్బీనగర్, నవంబర్ 26 : నకిలీ భూపత్రాలు, రిజిస్ట్రేషన్ పత్రాలతో అపార్ట్‌మెం ట్‌లో ప్లాట్లు, ఓపెన్ ప్లాట్లు విక్రయిస్తున్న వ్యక్తిని నాగోల్ పోలీసులు, మల్కాజిగిరి ఎస్వో టీ బృందం అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్‌కుమార్ వివరాలు వెల్ల డించారు. లక్ష్మీపురి కాలనీకి చెందిన మన్నెం సంతోష్‌కుమార్ మూడేళ్ల నుంచి నకిలీ పత్రాలతో ఒకరికి తెలియకుండా మరొకరికి అపార్ట్‌మెంట్‌లో ప్లాట్లు, ఓపెన్ ప్లాట్లు విక్రయిస్తున్నాడు.
అలా మోసపోయిన ప్రభాకర్ అనే బాధితుడు ఇటీవల నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడి కదలికలపై నిఘా పెట్టి నాగోల్ పోలీసులు, మ ల్కాజిగిరి ఎస్వోటీ బృందం సాయంతో మంగళవారం సంతోశ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకున్న పోలీసులను సీపీ సుధీర్‌బాబు అభినందించాడు.