calender_icon.png 12 February, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చీటీల పేరుతో ఘరానా మోసం...

10-02-2025 06:01:30 PM

చీటీల పేరుతో రూ.20 కోట్ల శటగోపం..

ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు..

కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం కేంద్రంలోని బూడిద గడ్డ నివాసి హనుమంతు వెంకటరమణ, కిన్నర ఎంటర్ప్రైజెస్ నిర్వాహకుడు, చీటీల పేరుతో పేద మధ్య తరగతి ప్రజలకు సుమారు రూ.20 కోట్ల మోసం చేసి, జనవరి 20వ తేదీ నుంచి కనిపించడం లేదని బాధిత కుటుంబాలు ఎన్ని చోట్ల తిరిగి ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదని, సోమవారం ఉదయం కలెక్టర్ ఆఫీసులో ప్రజావాణిలో కలెక్టర్ కు వెంకటరమణపై ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించారు. అంతేకాకుండా అతను ఓ దినపత్రిక  టౌన్ రిపోర్టర్ అని, బెదిరింపు చర్యలకు పాల్పడ్డాడనే విషయాన్ని కూడా కలెక్టర్ దృష్టికి  తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్, బాధిత కుటుంబాలకు తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.