calender_icon.png 23 January, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం

23-01-2025 01:57:29 AM

  • రెండు రాష్ట్రాల్లో 1,500 మందికి పైగా బాధితులు

ఒక్కొక్కరి నుంచి రూ.౭౦ వేల వసూలు

మయిన్వ ఇండియా లిమిటెడ్‌పై ఖమ్మంలో సీపీకి ఫిర్యాదు

ఖమ్మం, జనవరి 22 (విజయక్రాంతి):ఉద్యోగాల పేరుతో వందలాదిమంది యువకులను ఓ సంస్థ చేసిన మోసం చేసిన ఉదంతం ఖమ్మంలో వెలుగుచూసింది. ఈ విషయమై బాధితులు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌ను బుధవారం కలిసి ఫిర్యాదు చేశారు. చండీఘడ్‌లోని మయిన్వ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ ఈజీ మనీ పేరుతో చైన్ లింక్ సిస్టంతో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాల ఆశ చూపించి ఒక్కొక్కరు నుంచి రూ.70 వేలు వసూలు చేసింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి 1,500 మందికి పైగా ఈ సంస్థ బారిన పడి మోసపోయినట్లు సమాచారం. ఖమ్మం జిల్లా నుంచి వందలాది మంది ఉద్యోగాల కోసం చండీఘడ్ పోయి మోసపోయినట్లు తెలిసింది. సంస్థ ఉద్యోగాలు ఇవ్వకపోడంతో మోసపోయామని గ్రహించి బుధవారం ఖమ్మం వచ్చి సీపీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపుతామని బెదిరింపు కాల్స్ చేస్తున్నారని బాధితులు తెలిపారు.