calender_icon.png 18 January, 2025 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీజీ ఇంజనీరింగ్ ఆదాయంలో 29 శాతం వృద్ధి

18-01-2025 01:44:11 AM

హైదరాబాద్, జనవరి 17: హైదరాబాద్ కేంద్రంగా వివిధ ఇంజనీ రింగ్ ఉత్పత్తుల తయారీలో నిమగ్నమైన జీజీ ఇంజనీరింగ్ స్టాండెలోన్ ఆదాయం 2024 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 29.15 శాతం వృద్ధిచెంది రూ. 56.18 కోట్ల కు చేరింది. గత ఏడాది క్యూ3లో కంపెనీ రూ.43.50 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2024 డిసెంబర్ త్రైమాసికంలో రూ.1.37 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలలకు కార్యకలాపాల ఆదాయం రూ. 231.61 కోట్లుగా నమోదయ్యింది. రూ.7.86 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.