calender_icon.png 4 March, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ గా భద్రాచలం చెందిన జెట్టి సల్మాన్ రాజ్ నియామకం

03-03-2025 08:06:49 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం పట్టణానికి చెందిన న్యాయవాది జెట్టి సల్మాన్ రాజ్ ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ (AGP)గా నియమించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా భద్రాచలం చెందిన సాల్మన్ రాజ్ మాట్లాడుతూ.. నా నియమానికీ సహకరించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, మహాబాద్ ఎంపి పోరిక బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులకు కృతజ్ఞతలు తెలియజేసారు. అధేవిధంగా తనకి ఇటువంటి గుర్తింపు రావడానికి మొదటి నుంచి తన వెన్నంటే ఉంటు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అంధించిన తన మిత్రుడు, టిపిసిసి రాష్ట్ర కమిటీ సభ్యులు బుడగం శ్రీనివాస్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

జెట్టి సల్మాన్ కి బుడగం శ్రీనివాస్ అభినందనలు: 

ఆదినుంచి అంధరితో స్నేహపూర్వకంగా మెలుగుతు, సామాన్యుడికి కూడా న్యాయం అందేలా కృషి చేస్తు ధనార్జనకు విలువ ఇవ్వక, ప్రతి పేదవాడికి సమానమైన చట్టపరమైన సహాయ సహకారులు అంధిస్తు సౌమ్యుడిగా మన్ననలను పొంది భద్రాచలం కోర్టులో విధులు నిర్వహిస్తు ఉన్నత స్థానానికి చేరుకున్న తన మిత్రుడు జెట్టి సల్మాన్ ఈరోజు తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వ అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ (AGP)గా నియమితులవ్వడం అభినందిచదగ్గ పరిణామంగా హర్షం వ్యక్తం చేస్తు.. ఈ  సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన బుడగం శ్రీనివాస్.