calender_icon.png 16 November, 2024 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈజీమనీకి అలవాటుపడి

16-11-2024 12:27:14 AM

చైన్‌స్నాచర్లుగా మారిన బీటెక్ విద్యార్థులు

ఎల్బీనగర్, నవంబర్ 15: ఈజీమనీకి అలవాటుపడి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురిని శుక్రవారం చైతన్యపురి పోలీసులు అరెస్టు చేశారు. ఎండ్రకంటి రవితేజ(21),  ముష్టి సందీప్(19), జంగం సుమంత్(19), బొంబాయి ఉదయ్ (19), గొడుగు చరణ్(19).. వీరంతా కొత్తపేట- చైతన్యపురి ప్రాంతంలోని మున్సిపల్ కాలనీలో నివసిస్తున్నారు.

రవితేజ కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. మిగిలిన నలుగురు వివిధ జిల్లాల నుంచి వచ్చి దేశ్‌ముఖ్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ చదువుతున్నారు. ఈ క్రమంలో వీరందరూ స్నేహితులుగా మారారు. వ్యసనాలకు బానిసైన వీరు చైన్‌స్నాచర్లు, దొంగలుగా మారారు.

ఒంటరిగా వెళ్తున్నవారిని టార్గెట్ చేసి, వారినుంచి బంగారం, సెల్‌ఫోన్లను చోరీ చేసేవారు. చైతన్యపురిలో శుక్రవారం వీరంతా అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలను ఒప్పుకున్నారు. డీసీపీ ప్రవీణ్‌కుమార్, ఏసీపీ కృష్ణయ్య, చైతన్యపురి సీఐ వెంకటేశ్వరరావు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.