calender_icon.png 25 October, 2024 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లిప్ సర్జరీ చేయించుకుంటున్నారా?

14-09-2024 12:00:00 AM

ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటున్నా రు. అందుకోసం సర్జరీలు చేసుకునేందుకైనా వెనుకాడటంలేదు. అయితే పెదాలు అందంగా కనిపించేందుకు సర్జరీలు కూడా చేసుకుంటున్నారు కొంతమంది మహిళలు. ముఖ్యంగా సోషల్‌మీడియాలో బ్యూటీ ట్రెండ్స్ పెరగడం, సెలబ్రిటీల ప్రభావంతో లిప్ ఫిల్లర్స్ అనే ట్రీట్‌మెంట్ సర్వసాధారణమైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా  ప్రాచుర్యం పొందిన నాన్ సర్జికల్ కాస్మెటిక్ విధానాలలో ఒకటి. ఒక్క అమెరికాలోనే ఏటా లక్షలాది లిప్ ఫిల్లర్ ఆపరేషన్లు చేస్తుంటారు.

దీంతో ఇతర దేశాల్లో డిమాండ్ పెరిగింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారు, వయసుపైబడినవా రు ఈరకమైన ఆపరేషన్లు చేసుకుంటున్నా రు. త్వరగా కోలుకోవడం, మంచి ఫలితాలు ఇస్తుండటంతో పాపులర్ అయ్యింది. 

“పెదాల అందాన్ని పెంచేందుకు ఇంజక్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఒక రకమైన డెర్మల్ ఫిల్లర్, సింథటిక్ హైలురోనిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి. పెదవుల పరిమాణం, ఆకారం, రూపాన్ని మార్చేస్తాయి” అని ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అనూప్ ధీర్ అన్నారు. హైలురోనిక్ ఆమ్లం లేదా డెర్మల్ ఫిల్లర్లు ఇంజెక్ట్ చేసినప్పుడు పెదాల రూపం పూర్తిగా మారిపోతుంది. అయితే ఈ ట్రీట్ మెంట్ వల్ల ఎన్ని లాభాలున్నాయో.. అంతకంటే నష్టాలున్నాయి. 

ట్రీట్‌మెంట్ ఎందుకంటే

* చాలా మంది మరింత యవ్వనంగా కనిపించేందుకు పెదాలను సర్జరీ చేయించుకుంటున్నారు. అలాగే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను వాడుతున్నారు. 

* పెరిగేకొద్దీ, వారి పెదవుల పరిణామం కూడా పెరుగుతుంది. దాంతో పెదాలు అందహీనంగా మారుతాయి. నేచురల్ లుక్ కోసం ఈరకమైన సర్జరీ చేసుకుంటున్నారు.

* కొంతమందికి సహజంగా సన్నని పెదాలు ఉంటాయి. అలాంటివారు కూడా లిప్ సర్జరీ చేయించుకుంటున్నారు. 

కొన్ని నష్టాలు

లిప్ ఫిల్లర్లు తాత్కాలికమైనవి. కొద్దిరోజుల మాత్రమే ప్రభావం చూపుతాయి. ఆ తర్వాత పెదాల పరిమాణం మారుతుంది. పెదవి ఫిల్లర్లు గాయాలకు దారితీస్తాయి. సరిగ్గా ఇంజెక్ట్ చేయకపోతే రెండు పెదాల్లో తేడాలొస్తాయి. దాంతో ఒకటి చిన్నగా, మరొకటి పెద్దగా కనిపించి అందాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి డాక్టర్ల సూచన మేరకే సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది.