గిరిజన విద్యార్థులను పరామర్శించిన మంత్రి రాజనర్సింహ
హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి) : నిమ్స్‌లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థినులు త్వరగా కోలుకుని బడికి వెళ్లాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆకాంక్షించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు మహాలక్ష్మి, జ్యోతి, శైలజను మంత్రి సోమవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి విద్యార్థినులతో ముచ్చటించిన అనంతరం వారి ఆరోగ్యంపై వైద్యులను ఆరా తీశారు. అదేవిధంగా సాధారణ రోగులతోనూ మంత్రి మాట్లాడి వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. మంత్రి వెంట నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప ఉన్నారు.