24-03-2025 01:04:52 AM
అబ్దుల్లాపూర్‌మెట్, మార్చి 23: మాసబ్ చెరును పూర్తి స్థాయిలో సర్వే చేయించి.. సరిహద్దులు నాటించాలని చెరువు పరిరక్షణ సమితి అధ్యక్షులు బచ్చిగళ్ల రమేశ్ అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తన నివాసంలో మాసబ్ చెరువు పరిరక్షణ సమితి సభ్యులు కలిసి కృతజ్ఞతలు తెలిపి.. శాలువతో సత్కరిం చారు.
అనంతరం పరిరక్షణ సమితి అధ్యక్షులు రమేశ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అసెంబ్లీలో మాసబ్ చెరువు కబ్జాపై చర్చించడం వలన అధికారులు వెంటనే స్పందించి... చెరువులో వేసిన రోడ్డు తొలగించి వేశారన్నారు. అలాగే గణేష్ నిమ్మజ్జనాల సందర్భంగా వేసిన వ్యర్థాలని తొలగించేలా చర్యలు తీసుకొని... చెరువు పూర్తిగా సర్వే చేయించి.. సరిహద్దులను నాటించే విధంగా చూడాలన్నమని తెలిపారు. అదే విధంగా చెరువు యొక్క కాలువలను పునరుద్దరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాజా హోటల్ కూడా బఫర్ జోన్‌లోనే ఉంటుంది.. ఆ హోటల్‌కు పర్మిషన్లు ఎలా ఇచ్చారన్నారు. పూర్తి స్థాయిలో సర్వేచేసి.. వాటిపైనా కూడా చర్యలు తీసుకోనేలా చూడాలని కోరమన్నారు.
అక్రమాలకు పాల్పడితే ఎవ్వరిని వదలం : మల్‌రెడ్డి రంగారెడ్డి
మాసబ్ చెరువుకు అక్రమాలపై ఎంతటివారున్న ప్రభు త్వం వదలిపెట్టదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. చెరువులు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ప్రభుత్వ భూములను, పార్కులను కబ్జా చేస్తే హైడ్రా తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. అలాగే చెరువులో గణేష్ నిమ్మజ్జనానికి సంబంధించిన వ్యర్ధాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బచ్చిగాళ్ల రమేష్, కొంతం యాది రెడ్డి, గుత్త మహేందర్ రెడ్డి, బొక్క వంశీధర్‌రెడ్డి, భాస్కర్, దర్శన్, సునీల్, ఆశీర్వాదం, శ్యామల పాల్గొన్నారు.