calender_icon.png 4 February, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ టిప్స్‌తో మొటిమలు మాయం

28-01-2025 12:00:00 AM

ఎదిగే వయసులో మొటిమలు రావడం, చర్మం జిడ్డుగా మారడం లాంటి సమస్యలు బాధించడం సర్వసాధారణం. అయి తే ఈ విషయాలు తెలియక చాలామంది టీనేజ్ అమ్మాయిలు చర్మ సంరక్షణ కోసం అనవసర క్రీములు వాడుతూ మరింత అందహీనంగా తయారవుతుంటారు.

యుక్తవయస్సు కారణంగా హార్మోన్ల సమతుల్యత లోపిస్తుంది. దీంతో అమ్మాయిల్లో మొటిమలు వస్తాయి. అలాగే జంక్ ఫుడ్ తినడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలతోపాటు చర్మ సమస్యలు బాధిస్తుంటాయి.

చర్మం కూడా ఒక అవయవం అని టీనేజర్లు అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు. 

* మొటిమలను తాకవద్దు.. పిండవద్దు కూడా. 

* ముఖాన్ని రోజుకు రెండుసార్లు కడగాలి.

* నీరు పుష్కలంగా తాగాలి.

* ఒత్తిడిని తగ్గించుకోవడానికి క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలి. 

* ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. 

* నిద్రపోయే ముందు మేకప్‌ను సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. 

* రెగ్యులర్‌గా మేకప్ వేసుకుంటే, వారంలో ఒకరోజు మేకప్‌కు దూరంగా ఉండాలి. 

* నాన్-కామెడోజెనిక్ ఉత్పత్తులను ఉపయోగించండి.

* మొటిమలు అదేపనిగా వస్తే డాక్టర్లను సంప్రదించండి.