11-04-2025 12:23:01 AM
వరంగల్ వజ్రోత్సవ వేడుక వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన మాజీమంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి
మహబూబ్ నగర్ ఏప్రిల్ 10 (విజయ క్రాంతి) : ఈనెల 27వ తేదీన వరంగల్లో నిర్వహించనున్న టిఆర్‌ఎస్ పార్టీ వజ్రోత్సవ వేడుకలకు గులాబీ నాయకులు కార్యకర్తలు సిద్ధం కావాలని మాజీ మంత్రి డాక్టర్ శ్రీ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం జడ్చర్ల పట్టణంలోని తన నివాసంలో ఏప్రిల్ 27 న వరంగల్ లో జరిగే బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ,రజతోత్సవ బహిరంగసభ వాల్ పోస్టర్ ను మాజీ మంత్రివర్యులు డా.సి.లక్ష్మా రెడ్డి ఆవిష్కరించారు..
అనంతరం చలో వరంగల్ వాల్ రైటింగ్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డా.సి. లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 25 వ వసంతం లోకి పార్టీ అడుగు పెడుతుందని, బీఆర్‌ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధనకు 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందన్నారు. సాధించిన తెలంగాణను కెసిఆర్ ముఖ్యమంత్రి గా అభివృద్ధి పథంలో నడిపించారని పేర్కొన్నారు.
కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అయినప్పటికీ భారతదేశంలో మిగతా రాష్ట్రాలను అధిగమించి నెంబర్ వన్ గా తెలంగాణ నిలిచిందని స్పష్టం చేశారు. జడ్చర్ల నుంచి 3 వేల మంది బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు వెళ్ళేందుకు సిద్ధం కావాలని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ సభ త్వరలో ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.