calender_icon.png 30 November, 2024 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరాటానికి సిద్ధం కావాలి

30-11-2024 02:30:34 AM

  1. కాంగ్రెస్ మెడలు వంచాలి
  2. రాష్ట్రంలో నిస్సిగ్గుగా విజయోత్సవాలు
  3. పోలీసుల్లేకుండా కాంగ్రెసోళ్లు గ్రామాలకెళ్తే ప్రజలు తరమికొడతరు..
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  5. కరీంనగర్ జిల్లా అల్గునూరులో ‘దీక్షా దివస్’

మానకొండూర్, నవంబర్ 29: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నాడు స్వరాష్ట్రం కోసం ఆమరణ దీక్షకు పూనుకున్నట్లుగానే, రాష్ట్ర ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలోని అల్గునూరులో శుక్రవారం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన 16 ఏళ్ల ‘దీక్షా దివస్’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

తొలుత ఎల్‌ఎండీ కాలనీలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం గులా బీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీగా సభాస్థలికి చేరుకున్నారు. సభలో కేటీఆర్ ప్రసంగిస్తూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమ లు చేసేలా, కాంగ్రెస్ మెడలు వంచుతామని ప్రకటించారు.

కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామని ఇదే అల్గునూరు నుంచి తాను ప్రకటన చేస్తున్నానని, గులాబీ శ్రేణులు ఉద్యమ స్ఫూర్తితో ఆందోళనలు చేపట్టాలని సూచించారు. ఏడాది పాలనలోనే అత్యంత ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు నిస్సిగ్గుగా విజయోత్సవాలు చేసుకోవడం హాస్యాస్పదన మని ఎద్దేవా చేశారు.

పోలీసులు లేకుండా కాంగ్రెసోళ్లు గ్రామాలకు వెళితే, తరమికొట్టే పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరూర సంతోషంగా లేరని, ఇచ్చిన గ్యారెంటీలు 420 హామీలు అయ్యాయని ఎద్దేవా చేశారు. ‘తెలంగాణ చరిత్రలో కేసీఆర్ హిమాలయం.. సీఎం రేవంత్‌రెడ్డి నువ్వాయన కాలిగోటికి కూడా సరితూగవు.

మా వెంట్రుక కూడా పీకలేవు. నీకిప్పుడు ప్రజలు అధికారం ఇచ్చి ఉండవచ్చు. కానీ, వారి గుండెల్లో ఉన్నది మాత్రం కేసీఆర్ మాత్రమే. నాడు ఉద్యమకారుల తలపై తుపాకీ ఎక్కుపెట్టినోళ్లు ఇప్పుడు కేసీఆర్‌పై మాటలు తూలుతున్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకుంటే.. కేసీఆర్ అడుక్కుతినే వారనట్లు మాట్లాడుతున్నారు.

సీఎం రేవంత్‌రెడ్డీ.. మేం సవాల్ విసురుతున్నాం. మీ ఏడాది పాలన ఎలా ఉందనే విషయం తేలు ద్దాం. దమ్ముంటే రా.. రాష్ట్రంలో ఎక్కడికైనా పోదాం.. ప్రజలు ఎమంటున్నరో విందాం’ అని కేటీఆర్ సవాల్ విసిరారు. గురుకుల పిల్లలకు పిడికెడు మెతుకులు పెట్టలేనోళ్లకు విజయోత్సవాలు ఎందుకని ప్రశ్నించారు.

కేసీఆర్ అంటే పేరు కాదు.. పోరు

2009 నవంబర్ 28న కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్నారని, దీనిలో భాగంగానే కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వెళ్తుండగా, పోలీసులు అల్గునూరు చౌరస్తా వద్ద కేసీఆర్‌ను అదుపులోకి తీసుకున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. నాడు కరీంనగర్ నుంచి కేసీఆర్ పోరాటం లేకుంటే తెలంగాణ రాకపోయేదని అభిప్రాయపడ్డారు.

ఆ ఉద్యమం అన్ని జిల్లాలను పోరాటంలో భాగస్వాములను చేసిందని, తద్వారా తెలంగాణను సాధించుకోగలిగామని స్పష్టం చేశారు. నాడు కేసీఆర్ ఒక్కో మాట తూటాలాగా పేలిందన్నారు. రాజకీయ వేదికల ద్వారానే తెలంగాణ సాధిస్తామని ఆయన మాట అక్షర సత్యమైందన్నారు. కేసీఆర్ నాయకత్వం, అమరుల త్యాగం, కాంగ్రెస్ కర్కశ త్వంపై ప్రజాగ్రహంతోనే స్వరాష్ట్ర కల సాకారమైందని గుర్తుచేశారు. 

ప్రొఫెసర్ జయశం కర్, విద్యాసాగర్ వంటి ఎందరో మేధావులు మలిదశ ఉద్యమం పురుడు పోసుకో వాలని చూశారని, ఆ లోటును కేసీఆర్ భర్తీ చేశారని, తద్వారా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడిందని తెలిపారు. కేసీఆర్‌కు పదవీ వ్యా మోహం లేదని, నిస్వార్థంగా తెలంగాణ కోసమే కొట్లాడారని, కేసీఆర్ అంటే కేవలం పేరు కాదని, తెలంగాణ పోరు అని నినదించారు.

కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా అంటేనే పోరాటాల గడ్డ అని కొనియాడారు. అల్గునూరు చౌరస్తాలో కేసీఆర్ చరిత్ర చెరిపే దమ్ము ఎవరికీ లేదన్నారు.

తెలంగాణ చరిత్రను, కేసీఆర్ పోరాటాన్ని మరోసారి ప్రజలకు చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కరీంనగర్ నగర మేయర్ వై సునీల్‌రావు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, ముఖ్యనేతలు శేఖర్‌గౌడ్, కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, రావుల రమేశ్, లేగల వీరారెడ్డి, సల్ల మహేందర్, గూడూరు సురేశ్ పాల్గొన్నారు.