16-04-2025 01:14:51 AM
గజ్వేల్, ఏప్రిల్ 15: ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులను త్వరగా మంజూరు చేయాలని పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి శశిధర శర్మ ఉపాధ్యాయులతో కలిసి గజ్వేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అన్నపూర్ణ కు వినతిపత్రం అందజేశారు. గజ్వేల్ జిల్లా ఆస్పత్రిలో డాక్టర్ అన్న పూర్ణ కు వినతి పత్రం అందజేసిన శశిధర శర్మ విలేకరులతో మాట్లాడారు.
ఉపాధ్యాయుల రీయంబర్స్మెంట్ బిల్లులు త్వరితగతిన పరిశీలించి పంపించాలని సూపర్డెంట్ డాక్టర్ అన్నపూర్ణ, అడ్మినిస్ట్రేటివ్ అధికారిని జయశ్రీ లతో ఉపాధ్యాయుల మెడికల్ రియంబర్స్మెంట్ సమస్యల గురించి చర్చించామ న్నారు. ఈ మేరకు సూపరిండెంట్ అన్నపూర్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యోగు లకు ఏ ఇబ్బందులు లేకుండా త్వరిత గతిన బిల్లులు మంజూరు చేసి పంపిస్తామని ఎవరికి ఇబ్బంది కలగకుండా చూస్తామన్నారు.
ఈ సందర్భంగా వారికి ఉపాధ్యాయులు పిఆర్టియు డైరీ అందించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల ప్రధాన కార్యదర్శి తీగుళ్ల లింగం, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దొమ్మాట జానకిరామ్ రెడ్డి, ఊడెంవేమారెడ్డి,కుకునూరు శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పబ్బ వెంకటేష్, రాయపోల్ మండల మాజీ ప్రధాన కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.