04-03-2025 01:58:55 AM
25 శాతం ఫీజు మినహాయింపు: హెచ్‌ఎండీఏ
హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): అనుమతి లేని లేఅవుట్లలో ఆగస్టు 26, 2020 నాటికి 10 శాతం ప్లాట్లు రిజిస్టరై ఉండి మిగిలిన 90 శాతం ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌లో రెగ్యులరైజేషన్‌కు అవకాశం కల్పించి నట్టు హెచ్‌ఎండీఏ ఒక ప్రకటనలో తెలిపిం ది. యజమానులు ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేయకపోయినా ఇది వర్తిస్తుంది. ప్లా ట్లు కొనుగోలు చేసి.. సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి రెగ్యులరైజేషన్ కోసం మార్చి 31 వరకు 25శాతం రాయితీ కల్పించారు.
ఈ నెలాఖరులోగా రెగ్యులరైజేషన్, ప్రో-రేటా ఓపెన్ స్పేస్ చార్జీలు చెల్లించే దరఖాస్తుదారులు ఈ చార్జీలపై 25శాతం రాయితీ పొం దనున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ 2020 దరఖాస్తు తిరస్కారానికి గురైతే, చెల్లించిన మొత్తంలో ప్రాసెసింగ్ చార్జీల కోసం 10 శాతం మినహాయించుకొని మిగతా 90 శాతం తిరిగి చెల్లిస్తామని తెలిపారు. సమాచారం కోసం హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన 1800 599 8838 కాల్ సెంటర్లో సంప్రదించవచ్చు.