మహబూబ్ నగర్: ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించే అలవాటు చేసుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం ఈరోజు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బికె రెడ్డి కాలనీ (వార్డు నెంబర్ 21) లో ప్రజలకు ఆయన ఉచితంగా ఆరు మొక్కలు పంపిణీ చేసి మాట్లాడుతూ మనకు జీవితంలో గొప్ప మిత్రుడు చెట్టు అని నిత్య జీవితంలో మనకు ఎన్నో రకాలుగా చెట్టు ఉపయోగపడుతుంది అని ఆయన చెప్పారు. ప్రతి చెట్టుకు కూడా ట్రీ గాడ్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించారు. మనకు ఇష్టమైన వారి పేరున మొక్కలు పరిరక్షణ బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు . ఇంటింటా పచ్చని చెట్లు నాటుదాం ఆరోగ్యాన్ని రక్షించుకుందాం అని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ గారితో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.