calender_icon.png 20 April, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్విమ్మింగ్‌తో ఫిట్‌గా!

06-04-2025 12:00:00 AM

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ అనేక రకాల వ్యాయామాలు చేస్తుంటాం. అయితే వీటికి బదులు అవకాశం ఉంటే స్విమ్మింగ్ చేస్తే శరీరం మరింత ఫిట్‌గా ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే స్విమ్మింగ్ వల్ల అనేక ప్రయోజనాలూ ఉన్నాయి. అవేంటో చూద్దాం.

ప్రతిరోజు ఉదయం కాసేపు స్విమ్మింగ్ చేయడం వల్ల శరీరంలోని అదనపు కేలరీలు ఖర్చు అయ్యి కొవ్వు తొలగిపో తుంది. దీనివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఎక్కువ బరువు ఉన్నవారు తగ్గే అవకాశం ఉంటుంది. పైగా ఎముకలు బలంగా తయారవుతాయి. 

రోజూ ఈత కొట్టే వారికి గుండె సమస్యలు వచ్చే ముప్పు తక్కువని పలు అధ్యయనాల్లో తేలింది. ఈత వల్ల కండరాలు బలంగా మారి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. 

నిద్రలేమితో బాధపడేవారు రోజూ కాసేపు స్విమ్మింగ్ చేస్తే ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. 

రోజూ ఈత కొట్టడం వల్ల ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటివి తగ్గుతాయి. మానసిక సమస్యల నుంచి బయటపడొచ్చు.