calender_icon.png 22 March, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్ఆర్ఎస్ పై రాయితీ పొందండి

21-03-2025 10:53:47 PM

 ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ

ఖానాపూర్,(విజయక్రాంతి): ప్లాట్లు కొనుగోలుదారులు వాటిని క్రమబద్ధీకరించుకోవడానికి ఎల్ఆర్ఎస్ చెల్లింపు(LRS Payment)పై ఈనెల చివరి వరకు 25% రాయితీ(Discount) పొందవచ్చునని ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ(Khanapur Municipal Commissioner Jadhav Krishna) అన్నారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎల్ఆర్ఎస్ చెల్లించి లేఅవుట్లు, వ్యవసాయ భూములను క్రమబద్ధీకరించుకొని తమ ఆస్తులను రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించారు. కాగా, ఈనెల 31 వరకు చెల్లింపుపై 25% రాయితీ ప్రభుత్వం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.