06-03-2025 01:06:18 AM
శ్రీ చైతన్య కళాశాల చైర్మన్ ముద్దసాని రమేశ్‌రెడ్డి
తిమ్మాపూర్, మార్చి 5 : ఉన్నత విద్యాభ్యాసాన్ని అభ్యసిస్తున్న విద్యార్థులు విద్యాభ్యాసం పూర్తయ్యలోగా ప్లేస్మెంట్ ల ద్వారా ఉద్యోగాలను సాధించాలని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఎల్‌ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ వారి ఎస్పరంజ 20 25 సంయతి ఫ్రెషర్స్ డే వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు నిత్యం హాజరై సమగ్ర విజ్ఞానం వృత్తిపట్ల కలిగి ఉండాలని కోరారు. వివిధ కంపెనీలలో చాలా ఉద్యోగ అవకాశాలు కలిగి ఉండడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా సాధించాలన్నారు. ఆర్టిఫిషియల్, ఇంటలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డాటా సైన్స్ కోడింగ్, ల పట్ల సమగ్ర విజ్ఞానం కలిగి ఉన్నప్పుడే తాము అనుకున్న ఉద్యోగ అవకాశాలను సాధిస్తారని పేర్కొన్నారు.
అనంతరం కళాశాలలో ఈనెల 17 నుంచి 22 వరకు మెగా స్పోర్ట్స్ ఈవెంట్స్ 20 25 నిర్వహించనున్నామని ఈ ఈవెంట్స్‌లో పాల్గొనే వారు 8 వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా జి వెంకటేశ్వర్లు ఈసీఈ విభాగాధిపతి డా ఎస్ నరేష్ కుమార్, పి.ఓదెలు, మీడియా ఇన్ఛార్జ్ గుంటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.