calender_icon.png 26 October, 2024 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారతీయులకు జర్మనీ వీసాలు పెంపు

26-10-2024 12:29:19 AM

20 వేల నుంచి 90 వేలకు..

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: నైపుణ్యమున్న భారత శ్రామిక శక్తి కోసం వీసాలను పెంచుతూ జర్మనీ నిర్ణయం తీసుకుంది. ఈ సంఖ్యను 20 వేల నుంచి 90 వేలకు పెంచినట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. 18వ ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్‌లో ప్రధాని మాట్లాడుతూ.. వచ్చే 25 ఏళ్లకు వికసిత్ భారత్ కోసం ప్రణాళికను రూపొందించామని పేర్కొన్నారు. ఫోకస్ ఆన్ ఇండియా పేరిట జర్మనీ క్యాబినెట్ ఒక పత్రాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉందని.. ఈ నిర్ణయం ఆ దేశ వృద్ధికి దోహదం చేస్తోందన్నారు. కాగా మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ షూల్జ్ భారత్‌కు వచ్చారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో పర్యటించడం ఆనందాన్నిచ్చి ందని.. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని కొనియాడారు.