01-04-2025 01:30:18 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): నగరంలోని పహాడీషరీప్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. జర్మనీకి చెందిన ఓ యువతిపై కారు డ్రైవర్ సామూహిక అత్యాచారయత్నానికి పాల్పడారు. పోలీసుల కథనం ప్రకారం... జర్మనీకి చెందిన యువతి వారం రోజుల క్రితం ఆమెతోపాటు జర్మనీలో చదువుకున్న స్నేహితుడిని కలిసేందుకు హైదరాబాద్ వచ్చింది. నిన్న స్నేహితులతో కలిసి హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను సందర్శించారు. స్నేహితులను డ్రాప్ చేసి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు యువతి మందమల్లమ్మ వద్ద నుంచి క్యాబ్ బుక్ చేసుకుంది. యువతిపై కన్నేసిన క్యాబ్ డ్రైవర్ మందమల్లమ్మ నుండి బాలాపూర్ మీదుగా పహాడీ షరీఫ్ చెట్ల పొదలలో తీసుకువెళ్లి అత్యాచారయత్నం చేశాడు. దీంతో బాధిత యువతి డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో పహాడీ షరీఫ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు చేయండతో తక్షణమే స్పందించిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. యువతిని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగతుందని పోలీసులు పేర్కొన్నారు.