calender_icon.png 30 October, 2024 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోర్చుగల్‌కు జార్జియా షాక్

28-06-2024 02:18:23 AM

  • యూరోకప్

గ్లెసెన్‌కిర్చెన్ (జర్మనీ): ప్రతిష్ఠాత్మక యూరో కప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పోర్చుగల్‌కు షాక్ తగిలింది. గురువారం గ్రూప్   జార్జియా 2 పోర్చుగల్‌ను మట్టికరిపించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. జార్జియా తరపున  రపున (ఆట 2వ నిమిషంలో), జార్జస్ మికౌతాడ్జే (ఆట 57వ ని.లో) గోల్స్ సాధించా రు. ఆట ప్రారంభమైన 93 సెకన్లలోనే తొలి గో ల్ కొట్టి జార్జియా ఆధిక్యంలో నిలిచింది. తొలి హాఫ్‌లో పోర్చుగల్ పలుమార్లు గోల్‌పోస్ట్‌పై దాడి చేసినప్పటికీ లాభం లేకపోయింది.

రెండో అర్థభాగంలో పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకున్న జార్జస్ గోల్ కొట్టి జార్జియాను స్పష్టమైన ఆధిక్యంలో నిలిపాడు. మ్యాచ్ లో పోర్చుగల్ 690 పాస్ లు చేయగా.. జార్జి యా 270 పాస్‌లు నమోదు చేసుకుం ది. అయితే ఇప్పటి కే పోర్చుగల్ ప్రిక్వార్టర్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ జట్టు స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మాత్రం గోల్ చేయడంలో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో వాటర్‌బాటిల్‌ను తన్నిన రొనాల్డోకు యెల్లో కార్డు జారీ చేశారు. ఇక ప్రిక్వార్టర్స్‌లో స్లొవేనియాతో పోర్చుగల్, స్పెయిన్‌తో జార్జియాలు అమీతుమీ తేల్చుకోనున్నాయి.