calender_icon.png 18 April, 2025 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరంతర పోరాట స్ఫూర్తి జార్జిరెడ్డి

15-04-2025 12:00:00 AM

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం

ముషీరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అణుభౌతిక శాస్త్రంలో బంగారు పతకం పొందిన మేధావి, ఉస్మానియా అరుణతార కా..జార్జిరెడ్డి 53వ వర్ధంతి సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం హైద రాబాద్ - మేడ్చల్ - రంగారెడ్డి జిల్లాల కార్యవర్గల ఆధ్వర్యంలో సోమవారం  నారాయణ గూడ లోని కా..జార్జిరెడ్డి స్మారక స్థూపం వద్ద పూలమాలతో విప్లవ జోహార్లు అర్పించారు.

ఈ సందర్భంగా సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ గ్రేటర్ హైదరాబాద్ నగర కార్యదర్శి విజయ్, పి.డి.ఎస్.యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. సాంబలు మాట్లాడుతూ 1970 వ దశకంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అల్లరి మూకల ఆగడాలు, భూస్వామ్య, కుల దుహంకార, మతోన్మాద దాడులకు, ర్యాగిం గ్ చేష్టలకు వ్యతిరేకంగా, ప్రపంచ దేశాల విప్లవ పోరాటాలు, తెలంగాణ రైతంగా సా యుధ పోరాటం, నక్సల్బరీ, శ్రీకాకుళ గిరిజన పోరాటాలు ప్రేరేపితమై, సామ్రాజ్య వాద వ్యతిరేక పోరాట యోధుడు చేగువేరా స్ఫూర్తితో జార్జిరెడ్డి తన మిత్రులతో కలిసి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి (పి.డి.ఎస్) సంస్థను స్థాపించాడని అన్నారు.

విద్యను వ్యాపార సరుకుగా మార్చిన ఈ పాలకులు విద్యకు మతం రంగు పులుముతూ కాషాయీకరణ చేయా చూస్తున్నారని, ఈ తరు ణంలో విద్యార్థులు విద్యా వ్యాపారికరణ, కాషాయికరణను కా..జార్జిరెడ్డి స్ఫూర్తితో ప్రతిఘటించాలని, బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. అదే జార్జిరెడ్డి కి నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్ర మంలో పిఓడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.  సరళ, పిడిఎస్ యు హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్, మేడ్చల్ - రంగారెడ్డి జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు ఏం సైదు లు, సుమన్, సహాయ కార్యదర్శి వంశీ, మ హేష్, బన్నీ, ప్రవీణ్, వెంకటేష్, శివాజీ, శ్రీ కాంత్ తదితరులు పాల్గొన్నారు.