calender_icon.png 7 October, 2024 | 7:54 AM

తెలంగాణలో భౌగోళిక వారసత్వాన్ని పరిరక్షించాలి

07-10-2024 01:23:33 AM

దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ వేదకుమార్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (విజయక్రాంతి): తెలంగాణలో అద్భుతమైన వైవిధ్యం కలిగిన రాతి నిర్మాణాల శ్రేణులను పరిరక్షించి, భౌగోళిక వారసత్వాన్ని  కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ ఎం వేదకుమార్ అన్నారు.

ఆయా ప్రదేశాల భౌగోళిక విశిష్టత, ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ తరాలకు అందించడానికి యునె స్కో అధికారిక గుర్తింపు లభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అంతర్జాతీయ జి యోడైవర్సిటీ డేను పురస్కరించుకొని దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం గచ్చిబౌలి సమీపంలోని ఖాజాగూడ ఫక్రుద్దీన్ గుట్టను సందర్శించి, జియో హెరిటేజ్ ట్రయిల్ టాక్ ఆన్ జియోడైవర్సిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వేదకుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలోని పాం డవుల గుట్ట, భువనగిరి, దేవరకొండ, ఉం డ్రుకొండ, బొమ్మలమ్మ గుట్ట, ఫక్రుద్దీన్ గుట్ట తో పాటు వివిధ ఆకృతులతో కూడిన తెలంగాణలోని అనేక రాతి గుట్టలు, కట్టడాలు, స్థలాలు, ప్రాంతాలను గుర్తించి సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై, పౌర సమాజం పై ఉందన్నారు.

వీటిలో పాండవుల గుట్టను మాత్రమే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండి యా అధికారికంగా గుర్తించినట్టు తెలిపారు. తెలంగాణలో గుర్తింపునకు అర్హత కలిగిన మరెన్నో ప్రదేశాలు ఉన్నప్పటికీ, వాటిని కాపాడుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం ప్రముఖ చరిత్రకారుడు, తెలంగాణ కొత్త చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ మాట్లాడుతూ.. ఖాజాగూడ కొండలు అరుదైన సహజ శిలా నిర్మాణాలు అని అన్నారు. ఈ తరహా శిలా నిర్మాణాలను ప్రభుత్వాలు వెలుగులోకి తీసుకొచ్చి గుర్తించాలన్నారు. జీఎస్‌ఐ డైరెక్టర్ చక్కిలం వేణుగోపాలరావు మాట్లాడుతూ.. ఖాజాగూడలోని కొండలు హైదరాబాద్ గ్రానైట్ కాంప్లెక్స్‌గా పిలవబడతాయని తెలిపారు.

ఇవి 250 కోట్ల ఏళ్ల క్రితం నాటివని, 10 వేల చదరపు కిలో మీటర్లలో విస్తరించినట్టు తెలిపారు. కార్యక్రమం లో జీఎస్‌ఐ రిటైర్డ్ డైరెక్టర్ కమతం మహేందర్ రెడ్డి, జీఎస్‌ఐ సీనియర్ సైంటిస్ట్ సోమా రాంమూర్తి, ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్చర్ ఏఆర్ రామ్‌రాజ్, సేవ్ రెయిన్ వాటర్ ఫౌండర్ వై సుభాశ్ రెడ్డి, రాక్ ఆర్టిస్ట్ స్పెషలిస్ట్ వేముగంటి మురళీకృష్ణ, దక్కన్ హెరిటేజ్ అకాడ మీ ట్రస్ట్ డైరెక్టర్ కట్టా ప్రభాకర్, సేవ్ రాక్ సంస్థ ప్రతినిధులు సకీనా, జాజిర్ హుస్సేన్, శోభాసింగ్, ఎస్‌ఎస్ ప్రసాద్, రెయిన్ వాటర్ హార్వెస్ట్ నిపుణుడు మహమ్మద్ అఫ్జల్, ఇలియాస్ ఖాన్, ఎస్ ధనుంజయ, పీ నరహరి పాల్గొన్నారు.