calender_icon.png 13 January, 2025 | 11:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో 317తో ఉద్యోగులకు తీరని అన్యాయం

13-01-2025 02:56:14 AM

బీసీటీఏ డైరీ ఆవిష్కరణలో ఎంపీ ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): గత ప్రభుత్వం స్థానికతను ఎగతాళి చేస్తూ జీవో 317తో దుర్మార్గంగా వ్యవహరించిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఈ జీవో వల్ల పూర్తిగా అన్యాయం జరిగిందని ఆయన వాపోయారు. ఆదివారం బీసీటీఏ ఉపాధ్యాయ సంఘం డైరీని విద్యానగర్‌లోని తమ నివాసంలో కృష్ణయ్య ఆవిష్కరించారు.

317 జీవోలో నష్టపోయిన వారికి తిరిగి స్థానికత ఆధారంగా బదిలీలు జరిగేలా చూడాలని, బీసీలకు క్రిమీలేయర్ విధానాన్ని ఎత్తివేసేలా చూడాలని బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు ఎంపీ కృష్ణయ్యకు ఈ సందర్భంగా వినతిపత్రం అందించారు. బీసీ ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతున్నందుకు బీసీటీఏ అధ్యక్షుడు కృష్ణుడిను ఎంపీ అభినందించారు.

కార్యక్రమంలో బీసీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్, ఉపాధ్యక్షుడు నారాయణ యాదవ్, కార్యదర్శి రాందాస్, వివిధ జిల్లాల నాయకులు రాఘవేందర్, ధనంజయ, రవికుమార్, శ్రీనివాస్, సుభాష్, వేణు, శివకుమార్, వినోద్, కృష్ణమోహన్ పాల్గొన్నారు.