calender_icon.png 28 October, 2024 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానికత నిర్ణయించే జీవో 33 వెనక్కి తీసుకోవాలి

10-08-2024 01:29:42 AM

ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో మెడికల్ ప్రవేశాలకు స్థానికత నిర్ణయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్ మూర్తి, టీ నాగరాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో వల్ల తెలంగాణ విద్యార్థులు కూడా తమ స్థానికత కోల్పోయే ప్రమాదం ఉన్నదని శుక్రవారం ఒక ప్రకటన ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ విద్యార్థులు సైతం ఇతర రాష్ట్రాల్లో 9 తరగతులు చదివే అవకాం ఉందని, ఈ నిబంధనతో రాష్ట్ర విద్యార్థులు కూడా స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉందన్నారు.

గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం 6 నుంచి 12 వరకు ఏడేండ్ల కాలంలో ఏదైనా 4 అకడమిక్ ఇయర్స్ చదివి ఉంటే వారు స్థానికులని నిర్ణయించిందని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 9 వరకు చదివి ఉంటే స్థానికులని చెబుతుండటంతో తెలంగాణలో ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు కూడా స్థానిక కోటా పొందుతారని పేర్కొన్నారు. దీంతో నిజమైన స్థానికులకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. మెడికల్ విద్య ప్రవేశాల్లో 1 నుంచి 7వ తరగతి వరకు పాఠశాల విద్యను ప్రమాణికంగా తీసుకోవాలని డిమాం డ్ చేశారు. స్థానికులకు నష్టం లేకుండా ఈ సవరణలు చేసి మరో జీవో తీసుకురావాలని కోరారు.