సాయి రోనాక్, ప్రగ్యా నగ్రా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘లగ్గం’. దీన్ని మంచి కుటుంబ కథా చిత్రంగా పెళ్లి నేపథ్యంలో దర్శకుడు రమేశ్ చెప్పాల తెరకెక్కించారు. సుబిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్‌రెడ్డి నిర్మించారు. రాజేంద్రప్రసాద్, రోహిణి , ఎల్బీ శ్రీరామ్ కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందంటూ మూవీ యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా హీరో సాయిరోనక్ మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌లో ఇది ఫస్ట్ మైల్ స్టోన్ మూవీ. ఇందులో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు’ అన్నారు. నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “లగ్గం’ చిత్రం జెన్యూన్ హిట్. ఈ క్రెడిట్ మొత్తాన్ని నా సోదరుడు లాంటి దర్శకుడు రమేశ్ చెప్పాలకు ఇస్తాను” అన్నారు.
“లగ్గం’ చిత్రం కోసం నేను తొమ్మిది నెలల పాటు ప్రతి రోజు పద్దెనిమిది గంటలు కష్టపడ్డాను. ఈ ప్రయాణంలో నాకు ఎంతో మద్దతుగా నిలిచిన వాళ్లందరికీ కృతజ్ఞతలు. సినిమా మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉందని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది” అని దర్శకుడు రమేశ్ చెప్పాల చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వేణుగోపాల్‌రెడ్డి, రచ్చ రవి, మిగతా చిత్రబృందం పాల్గొని మాట్లాడారు.