08-04-2025 12:24:54 AM
కరీంనగర్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలకు ఉద్యోగులకు మరియు అధికారుల దాహార్తి తీర్చడం కోసం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా టీఎన్జీవోల సంఘం శ్రీకారం చుట్టడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ టీఎన్జీవోల సంఘం నాయకులు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలలో చాలా అభినందినీయ మని కొనియాడారు.
టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శి సంగం లక్ష్మణరావు టీజీవోల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళి చరణ్ గౌడ్ కార్యదర్శి డాక్టర్ అర వింద రెడ్డి కేంద్ర సంఘం నాయకులు నాగుల నరసింహస్వామి రాగి శ్రీనివాస్ గూడ ప్రభాకర్ రెడ్డి సర్దార్ హర్మేందర్ సింగ్ జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ జిల్లా సహాధ్యక్షులు ఒంటెల రవీందర్ రెడ్డి కరీంనగర్ పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్ కార్యదర్శి వెలిచాల సుమంత్ రావు 4వ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి కార్యదర్శి శంకర్ ఉమెన్ ఎంప్లాయిస్ చైర్మన్ ఇరుమల్ల శారద డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంజీత్ సింగ్ పెన్షనర్ల సంఘం అధ్యక్షులు పెండ్యాల కేశవరెడ్డి కార్యదర్శి లింగయ్య నాయకులు పోలు కిషన్ నగేష్ గౌడ్ శైలజ సబితా కరుణాకర్ లవ కుమార్ నారాయణ అజ్గర్ కయ్యం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు