07-03-2025 05:21:27 PM
డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందూలాల్
హుజురాబాద్,(విజయకాంతి): జనరిక్ మందులు(Generic Drugs) అత్యంత నాణ్యమైనవని హుజురాబాద్ అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ చందూలాల్(Deputy DMHO Dr. Chandulal) సూచించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలోని చల్పూర్ ఆరోగ్య ప్రాథమిక కేంద్రంలో శుక్రవారం జాతీయ అనౌష దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి ఏడవ తేదీన ప్రధానమంత్రి భారతీయ ఔషధి పరియోజన దినోత్సవం అని తెలిపారు.
జనరిక్ మందులు అత్యంత నాణ్యమైనవని చౌక ధరలో అందుబాటులో ఉంటాయన్నారు. దేశమంతా జనరిక్ మందుల దుకాణాలు అందుబాటులో ఉన్నాయని, బ్రాండెడ్ మందుల కంటే 60 శాతం తక్కువగా జరిగే మందులు లభ్యమవుతాయని తెలిపారు. జనరిక్ మందులు ఆరోగ్య భద్రతకు, ఆరోగ్య పరిరక్షణకు దౌదపడతాయన్నారు. ప్రజలందరూ జనరేక మందులు వాడేటట్లు అవగాహన కల్పించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ మధు, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ బంజారా ప్రతాప్, ఎంపిహెచ్ఓ విజయ కుమార్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు.